జడ్పీటీసీ అభ్యర్థికి బెదిరింపులు

ABN , First Publish Date - 2020-03-16T11:07:46+05:30 IST

జడ్పీటీసీ అభ్యర్థికి బెదిరింపులు

జడ్పీటీసీ అభ్యర్థికి బెదిరింపులు

బండి ఆత్మకూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కృష్ణానాయక్‌ను ఎమ్మెల్యే శిల్పాతో పాటు నంద్యాల డీఎస్పీ బెదిరించారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా ఆరోపించారు. బండి ఆత్మకూరు జనరల్‌ స్థానమైనా తాము ఎస్టీ అభ్యర్థిని నిలిపామని, కేసు నమోదు చేస్తామని బెదిరించి ఏకగ్రీవం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిపై నాటుసారా కేసులు ఉన్నాయని, అలాంటి వారికి పదవులు కట్టబెట్టడం ఏమిటని విమర్శించారు. బోధనం గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని కూడా బెదిరించారని అన్నారు. అనంతరం సారా కేసుల్లో పట్టుబడిన వైసీపీ అభ్యర్థి ఫొటోలను విలేకరులకు చూపించారు. తన వద్ద పనులు చేయించుకున్న చాలా మంది టీడీపీని వీడి వైసీపీలోకి చేరారని, వారికి శిల్పా సరైన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ఇందుకు నిదర్శనం ఆత్మకూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అని అన్నారు. 


Updated Date - 2020-03-16T11:07:46+05:30 IST