ఆ యువకుడు చనిపోయాడు

ABN , First Publish Date - 2020-12-13T05:46:32+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆ యువకుడు చనిపోయాడు

రుద్రవరం, డిసెంబరు 12: ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన ప్రభుదాస్‌ (25) చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవంబరు 17వ తేదీన మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. ప్రభుదాస్‌ను అతడి భార్య దేవి వెంటనే చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. ప్రభుదాస్‌ తల్లి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-13T05:46:32+05:30 IST