యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-01T06:15:55+05:30 IST
పట్టణంలోని కల్లుబావి కాలనీకి చెందిన రంగమ్మ, శేషప్ప దంపతుల కుమారుడు రంగన్న (24) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదోని, నవంబరు 30: పట్టణంలోని కల్లుబావి కాలనీకి చెందిన రంగమ్మ, శేషప్ప దంపతుల కుమారుడు రంగన్న (24) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగన్న ఇంటినుంచి బైటికి వెళ్లిపోయాక తిరిగి రాలేదని టూటౌన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సోమవారం వారి పొలంలోనే చెట్టుకు రంగన్న ఉరేసుకొని కనిపించాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రంగన్న ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. మృతుడికి భార్య దానమ్మతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య దానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.