వైసీపీ వర్గీయుల ఘర్షణ
ABN , First Publish Date - 2020-11-14T05:28:53+05:30 IST
పత్తికొండ పట్టణంలో వైసీపీ వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది.
- పత్తికొండలో ఉద్రిక్తత
- ఇరువర్గాలపై కేసు నమోదు
పత్తికొండటౌన్, నవంబరు 13: పత్తికొండ పట్టణంలో వైసీపీ వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. వివరాలివి.. మాజీ సర్పంచ్ సోమశేఖర్ తనయులు మధు, గోవర్ధన్‌నాయుడు తేరుబజారులోలో నిలిచి ఉండగా మరో వర్గానికి చెందిన శీను, లింగయ్య, చిరంజీవి దాడి చేశారు. గోవర్ధన్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో మాజీ సర్పంచ్ సోమశేఖర్ వర్గీయులు పెద్దఎత్తున ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఐలు ఆదినారాయణరెడ్డి, నారాయణరెడ్డి సిబ్బందితో చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.
అణగదొక్కేందుకే దాడి చేశారు: మధు, వైసీపీ యువనాయకుడు
బీసీలైన తమ కుటుంబాన్ని అణగతొక్కేందుకే పోచమిరెడ్డి మురళీధర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే నాపై, నా తమ్ముడిపై దాడి చేశారని వైసీపీ యువనాయకుడు, మాజీ సర్పంచ్ తనయుడు ఎంఎస్ మధు, గోవర్ధన్‌నాయుడు ఆరోపించారు.
దాడితో సంబంధం లేదు: మురళీధర్‌రెడ్డి
దాడితో తనకు సంబంధం లేదని, పోచమిరెడ్డి యువసైన్యం పేరుతో సేవా కార్యక్రమాలను చేప డుతున్నానని మురళీధర్‌రెడ్డి అన్నారు. కొంతమంది గిట్టని వారు లేనిపోని అభాండాలు నాపై వేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే తనయుడి పరామర్శ
గాయపడిన గోవర్ధన్‌నాయుడు, ఎంఎస్ మధును శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్‌రెడ్డి, కేడీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి పరామర్శించారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆదినారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. గోవర్ధన్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎరుకుల శీను, లింగయ్య, చిరంజీవిపై కేసు నమోదు చేశామని, అలాగే ఎరుకుల శీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవర్ధన్‌నాయుడు, మధులతోపాటు మరికొం దరిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.