వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

ABN , First Publish Date - 2020-12-26T17:10:17+05:30 IST

మండలంలోని రుద్రవరంలో..

వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

కర్నూలు(ఆంధ్రజ్యోతి): మండలంలోని రుద్రవరంలో శుక్రవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్‌ను గ్రామస్థులు నిలదీశారు.


ఎమ్మెల్యేకే తెలియదంట..

మా ఊరి వారికి పట్టాలు రాలేదని ఎమ్మెల్యేకి చెబితే తెలియదని బుకాయిస్తున్నాడు. ఇంతవరకు గ్రామస్థులకు ఎంతమందికి స్థలాలు మంజూరు అయ్యాయో తనకు తెలియదని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉంది. నాకు గతంలో అర ఎకరా ఉండేది. ప్రస్తుతం పొలం లేదు. అయిన కూడా నాకు స్థలం ఇవ్వలేదు. 

      - జమ్ములయ్య, రుద్రవరం

ఒంటరి మహిళను..

నేను ఒంటరి మహిళను. నాకు ఎలాంటి ఆధారమూ లేదు. అయినా ఇంటి పట్టా రాలేదు. దయచేసి పట్టా ఇప్పించి పుణ్యం కట్టుకోండి. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదు. 

 - లక్కీబాయ్, రుద్రవరం

Updated Date - 2020-12-26T17:10:17+05:30 IST