పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఆసరా
ABN , First Publish Date - 2020-09-12T15:41:51+05:30 IST
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల మహిళల ఆర్థిక పురోగతికి వైసీపీ

వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవంలో నాయకులు
నంద్యాల, సెప్టెంబరు 11: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల మహిళల ఆర్థిక పురోగతికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పథకానికి శ్రీకారం చుట్టిందని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ టౌన్ హాల్ భవనంలో ఆసరా పథకాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సీవీ రమణయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎంపీడీవో విజయభాస్కర్ పాల్గొన్నారు.
కర్నూలు,(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ ఆసరా పథ కాన్ని సీఎం జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఎన్నికల నాటికి వివిధ బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాల రుణాలను నాలుగు విడతల్లో ఈ పథకం ద్వా రా చెల్లిస్తున్నామన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుంచి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎమ్యెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మోహీద్దీన్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, మెప్మా ఇన్‌చార్జి పీడీ శిరీష పాల్గొన్నారు. అనంతరం ఈ పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతగా డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలోని ఎస్‌హెచ్‌జి సంఘాల సభ్యులకు రూ.306.39 కోట్ల చెక్కును అధికారులు, ప్రజాప్రతినిధులు అందజేశారు.
ఆళ్ల్లగడ్డ: పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వైఎస్సాఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించి పొదుపు మహిళలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మున్సిపాలిటి కమిషనర్ రమే్‌షబాబు, వైసీపీ నాయకులు నరసింహరెడ్డి, గజ్జల రాఘవేంద్రారెడ్డి, వెలుగు కో-ఆర్డినేటర్ దానం పాల్గొన్నారు.
బేతంచెర్ల: మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయ మని కర్నూలు ఆర్డీవో వెంకటేశం, వైసీపీ మండల నాయకుడు బుగ్గన నాగభూషణంరెడ్డి అన్నారు. బేతంచెర్ల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ రమే్‌షబాబు అధ్యక్షతన వైఎస్సార్ ఆసరా పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. సమావేశంలో బేతంచెర్ల, ప్యాపిలి ఎంపీడీవోలు అశ్వినికుమార్, ఫజుల్ రెహమాన్, తహసీల్దారు విద్యాసాగర్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
డోన్: పొదుపు మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా కింద 749 పొదుపు గ్రూపులకు రూ.4.41 కోట్లు చెక్కులను పంపిణీ చేశారు. షమీనా బేగం, వైసీపీ నాయకులు కోట్రికే హరికిషన్, ఆర్‌ఈ రాజావర్ధన్, హరి, మహేశ్వరరెడ్డి, రఫీ పాల్గొన్నారు.
సి.బెళగల్: మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. శుక్రవారం సి.బెళగల్ జడ్పీ ఉన్నతపాఠశాల ఆవరణలో మహిళలకు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.9,98 కోట్ల చెక్కును పొదుపు మహిళ సంఘాల బ్యాంకు ఖాతాలో జమ చేశారన్నారు.
రుద్రవరం: ఆలమూరు, రుద్రవరం గ్రామాల్లో వైఎస్సార్, సీఎం చిత్రపటాలకు పొదుపు మహిళలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పాణ్యం చంద్ర, ఏపీఎం నాగమ్మ పాల్గొన్నారు.
ఆత్మకూరు: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి శిల్పా భువనేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వైఎ్‌సఆర్ ఆసరా పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీహరి, మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు, ఎంపీడీవో కృష్ణమోహన్, ఏపీఎం పుల్లయ్య, వైసీపీ నాయకులు పువ్వాడి భాస్కర్, అంజాద్‌అలి, గౌస్‌లాజం, లాలు, సయ్యద్‌మీర్ పాల్గొన్నారు.
గూడూరు: ప్రభుత్వ పథకాలను పొదుపు మహిళలు వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని అంబ భవానీ కళ్యాణ మండపంలో నగర కమిషనర్ బి ప్రహ్లాద్, మెప్మా ఆధ్వర్యంలో వైఎ్‌సఆర్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మెప్మా టీఎంసీ సూర్యనారాయణ, వైసీపీ నాయకులు పీఎన్ అస్లాం, మాజీ జడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాణ్యం: పొదుపు మహిళల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసానిరాంభూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పాణ్యంలో ఏ ర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏసీ రవికుమార్, ఎంపీడీవో దస్తగిరి, ఏపీఎం శేఖర్ పాల్గొన్నారు.
గడివేముల: ప్రభుత్వ పథకాలను వినియోగించు కుంటూ మహిళలు ఆర్థిక పురోగతిని సాధించాలని ఎంపీడీవో మోహన్‌కుమార్ తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. మండలంలోని 610 పొదుపు సంఘాలకు గాను రూ.8.44 లక్షలు మం జూరైనట్లు తెలిపారు. సహకార సంఘ అధ్యక్షుడు ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎం అంబమ్మ పాల్గొన్నారు.
