మా వారి స్టాల్సే ఉండాలి

ABN , First Publish Date - 2020-11-26T05:53:56+05:30 IST

కర్నూలు మండలం పంచ లింగాల పుష్కరఘాట్‌ గుడి వద్ద కొంతమంది మత్స్యకార కుటుంబాలు అగరబత్తులు, టెంకాయలు, పండ్లు పూలు వంటి వస్తువులు విక్రయి స్తున్నాయి.

మా వారి స్టాల్సే ఉండాలి

  1.  వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి హుకుం


కర్నూలు(రూరల్‌), నవంబరు 25: కర్నూలు మండలం పంచ లింగాల పుష్కరఘాట్‌ గుడి వద్ద కొంతమంది మత్స్యకార కుటుంబాలు అగరబత్తులు, టెంకాయలు, పండ్లు పూలు వంటి వస్తువులు విక్రయి స్తున్నాయి. వీరికి ఎదురుగా వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి వర్గం స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గుడి ఆవరణంలో తన వర్గానికి చెందిన స్టాల్స్‌ మాత్రమే ఉండాలని, మిగిలిన వాటిని తొలగిం చాలని పంచాయతీ కార్యదర్శికి ఆ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేశారు. దీంతో ఖాళీ  చేయాలని మత్స్యకార కుటుంబాలకు పంచాయతీ కార్య దర్శి సూచనప్రాయంగా తెలియజేశారు. సోమవారం పుష్కరఘాట్‌కు వచ్చిన ఆ ప్రజాప్రతినిధి స్టాల్స్‌ అలానే ఉండడంతో పంచాయతీ కార్య దర్శితోపాటు ఎంపీడీవోపై కూడా కస్సుబస్సుమన్నారు. దీంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి నోటీసులను జారీచేస్తూ ఆ స్టాల్స్‌ను ఖాళీ చేయిం చాలని తాలుకా పోలీసులకు లేఖ పంపారు. గుడి స్థాపించినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామని, గంగమ్మకు పూజారులమని, ఎప్పట్నించో టెంకాయలు, పూలు అమ్ముకుంటున్నామని, ఇపుడు విక్రయిస్తే తప్పే ముందని స్టాల్స్‌ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వంద, యాబై రూపా యల వ్యాపారంలోనూ రాజకీయాలు చేయడం పట్ల నివ్వెరపోతున్నారు. 

Updated Date - 2020-11-26T05:53:56+05:30 IST