ప్రజాస్వామ్యయుతంగా గెలవండి : గౌరు చరితా రెడ్డి

ABN , First Publish Date - 2020-03-15T11:07:06+05:30 IST

తొమ్మిది నెలలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక

ప్రజాస్వామ్యయుతంగా గెలవండి : గౌరు చరితా రెడ్డి

కల్లూరు, మార్చి 14: తొమ్మిది నెలలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత డిమాండ్‌ చేశారు. శనివారం మాధవీనగర్‌లో స్వగృహంలో సాయంత్రం టీడీపీ జిల్లా నాయకుడు గౌరు వెంకటరెడ్డితో కలిసి విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు మద్దతుదారులను బెదిరించి, భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.


అభ్యర్థులకు ఫోన్లు చేసి పోటీ నుంచి తప్పుకోవాలని, భయబ్రాంతులుకు గురి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ మద్దతుదారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్‌ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే ఓడిపోతామనే నిసిగ్గుగా ఒత్తిడి తెచ్చి పోటీ లేకుండా చేయాలనుకోవడం సరైంది కాదని హితవు పలికారు.   టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా ఉంటామని, ధైర్యంగా పోటీ చేసి గెలవాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-03-15T11:07:06+05:30 IST