‘సీపీఎస్ ను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-03-04T09:48:56+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబందించిన సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.శ్రీనివాసరావు, రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎన్‌.నాగమణి డిమాండ్‌ చేశారు.

‘సీపీఎస్ ను  రద్దు చేయాలి’

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా


కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 3: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబందించిన సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని  పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.శ్రీనివాసరావు, రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎన్‌.నాగమణి డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం   జిల్లా పరిషత్తు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి  ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు  ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. సీపీఎ్‌సను   కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.ఎల్లప్ప, జె.సుధాకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యలను  వెంటనే పరిష్కరించాలన్నారు.  జిల్లా సహాఽధ్యక్షులు ఎస్‌ఎం జయరాజ్‌, ఎన్‌.శాంతి ప్రియ మాట్లాడుతూ 2018 జూలై నుంచి అమలు చేసిన పీఆర్‌సీ రెండు నెలలు దాటినా అమలు కాలేదన్నారు.  ఈ కార్యక్రమంలో యుటీఎఫ్‌ నాయకులు రఫిక్‌,  హేమంత్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T09:48:56+05:30 IST