-
-
Home » Andhra Pradesh » Kurnool » welcome to cm jagan at orvaka airport
-
విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం
ABN , First Publish Date - 2020-11-21T06:26:21+05:30 IST
తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ శుక్రవారం ఓర్వకల్లు విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు.

ఓర్వకల్లు, నవంబరు 20: తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్ శుక్రవారం ఓర్వకల్లు విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ వీర పాండియన్, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఐజీ వెంకట్రామిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నగరంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు బయలుదేరారు. అక్కడి తుంగభధ్ర పుష్కరాలను ప్రారంభించడానికి సంకల్‌బాగ్‌కు వెళ్లారు. అక్కడ పుష్కరాల ప్రారంభోత్సవ పూజలను ప్రారంభించారు. అక్కడి నుంచి 3 గంటలకు ప్రత్యేక హెలిప్యాడ్‌లో ఓర్వకల్లు విమనాశ్రయానికి చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీఐజీ వెంకట్రామిరెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, నందికొట్కూరు వైసీపీ నాయకుడు బైౖరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవదాయశాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసులు, విమానాశ్రయ సంస్థ అడ్వైజర్ భరత్ రెడ్డి, సీఎం పీఏ నాగేశ్వరరావు, ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. తహసీల్దార్ శివరాముడు, తాలుకా రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు విమానాశ్రయంలో 200 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.