రైతులకు సరిపడా యూరియా అందిస్తాం

ABN , First Publish Date - 2020-08-20T11:24:46+05:30 IST

రైతులకు అవసరమైన యూరియాను అందిస్తామని, డీలర్లు అధిక ధరకు యూరియాను విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని వ్య

రైతులకు సరిపడా యూరియా అందిస్తాం

అధిక ధరకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు 

జేడీఏ ఉమామహేశ్వరమ్మ 


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 19: రైతులకు అవసరమైన యూరియాను అందిస్తామని, డీలర్లు అధిక ధరకు యూరియాను విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ హెచ్చరించారు. బుధవారం ఆమె కర్నూలు మార్కెట్‌ యార్డులోని రైతుభరోసా హబ్‌లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఖరీప్‌ సీజన్‌లో ఇప్పటిదాకా ఎంత యూరియాను ఎక్కడెక్కడికి సరఫరా చేశారో తెలుసుకున్నారు.


జేడీఏ విలేకరులతో మాట్లాడుతూ వర్షాలకు యూరియాకు డిమాండ్‌ పెరిగిందని, కరోనా కారనంగా కొంతమంది రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి ఇళ్లల్లో నిల్వ చేసుకుంటుండం వల్ల కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెఫెడ్‌ వద్ద 13 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. జిల్లాకు కేటాయించిన యూరియా త్వరలోనే వస్తుందన్నారు. 

Updated Date - 2020-08-20T11:24:46+05:30 IST