కర్నూలు జిల్లాలో ఎన్నికల పరిశీలకులు
ABN , First Publish Date - 2020-12-13T05:57:51+05:30 IST
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. శనివారం పోలింగ్ కేద్రాలను తనిఖీ చేశారు.

చాగలమర్రి: మండలంలోని 17 సచివాలయాల పరిధిలోగల 50 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్ తెలిపారు. శనివారం ఆయా కేంద్రాల్లో బీఎల్‌వోలు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. చాగలమర్రిలో పోలింగ్ కేంద్రాలను ఆర్‌ఐ విజయలక్ష్మి పరిశీలించారు. ఓటర్లు ఫారం-6లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవాలని తెలిపారు. రెండు రోజుల పాటు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల దరఖాస్తులు స్వీకరిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఐ సూచించారు.
ఓర్వకల్లు: ఓర్వకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమాన్ని శనివారం ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు పీఏ శోభ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 217వ పోలింగ్ కేంద్ర పరిశీలనలో కొత్తగా వచ్చిన ఓటర్ల నమోదు, దరఖాస్తులు, ఫారం 7, 8 లకు సంబందించిన దరఖాస్తులపై ఆరా తీసి తహసీల్దార్ శివరాముడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో తనిఖీ చేశారు. ఆమె వెంట జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ శివరాముడు, ఆర్‌ఐ రంగస్వామి, వీఆర్వో మహబూబ్ బాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రుద్రవరం: ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని తహసీల్దార్ వెంకటశివ అన్నారు. శనివారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని నరసాపురం గ్రామంలో ఓటు హక్కు దరఖాస్తులను యువకుల నుంచి స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 51 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 42 ఓటు హక్కు దరఖాస్తులు వచ్చాయన్నారు. వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.