తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-12-13T05:40:53+05:30 IST

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్‌ పరిశీలకులు పీఏ శోభా సూచించారు

తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయండి
మాట్లాడుతున్న ఎలక్టోరల్‌ పరిశీలకులు శోభ, చిత్రంలో కలెక్టర్‌

  1.  ఎలక్టోరల్‌ పరిశీలకులు పీఏ శోభ


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 12: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎలక్టోరల్‌ పరిశీలకులు పీఏ శోభా సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ భవనంలో శనివారం ప్రత్యేక ఓటరు నమోదు, సవరణపై కలెక్టర్‌ వీరపాండియన్‌, డీఆర్‌వో పుల్లయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. 14 నియోజకవర్గాల ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు, సవరణలపై ఈఆర్‌ఓ, ఏఈఆర్‌వోలకు మరింత శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓటరు నమోదుపై గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారించాలని, సరైన పేర్లను మాత్రమే జాబితాలో చేర్చాలని సూచిం చారు. చిన్న చిన్న తప్పులు పెద్దపెద్ద ప్రమాదాలు తెచ్చి పెడతాయని, జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. బీఎల్‌ఓలకు అనుబంధంగా ప్రతి రాజకీయ పార్టీ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియించుకుంటే ఓటరు జాబితాలో తప్పులను అధిగమించవచ్చని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ఆధారం చేసుకుని పెండింగ్‌లో ఉన్న 16,265 క్లేమ్‌లను జనవరి 5లోగా పరిష్కరించాలని, జనవరి 15న తుది జాబితా సిద్ధం చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిందని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ఆ మేరకు ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-12-13T05:40:53+05:30 IST