నేటి నుంచి కూరగాయల వ్యాపారం
ABN , First Publish Date - 2020-09-07T06:25:01+05:30 IST
కూరగాయలు సాగు చేస్తున్న రైతులు, హోల్‌సేల్, రీటైల్ వ్యాపారులు ఐదారు నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు సోమవారం నుంచి తొలగిపోనున్నాయి. దాదాపు 10 కి.మీల దూరంలో ఉ
యార్డులో పర్యటించిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
కర్నూలు(అగ్రికల్చర్)/(న్యూసిటి): సెప్టెంబరు 6: జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు, హోల్‌సేల్, రీటైల్ వ్యాపారులు ఐదారు నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు సోమవారం నుంచి తొలగిపోనున్నాయి. దాదాపు 10 కి.మీల దూరంలో ఉన్న జగన్నాథగట్టు సమీపంలో కూరగాయల వ్యాపారం జరుగుతోంది. దీనికి ముగింపు పలికి సోమవారం నుంచి కర్నూలు యార్డులో వ్యాపారం తిరిగి ఆరంభం కానుంది.
హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ను కలిసి సమస్యను వివరించడంతో ఆదివారం ఆయన కర్నూలు మార్కెట్ యార్డులోని కూరగాయల మార్కెట్ యార్డును పరిశీలించారు. సోమవారం సాయంత్రం నుంచి హోల్‌సేల్ వ్యాపారం చేపట్టాలని, వ్యాపారులు, రైతు లకు అవసరమైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ శ్రీనివాసులును ఆదేశించారు.
సోమవారం సాయంత్రం రైతులు కూరగాయలను విక్రయిం చుకునేం దుకు యార్డులో అన్ని వసతులు కల్పించామని హోల్‌సేల్ వ్యాపారులకు ఈ విషయంపై సమాచారం అందించామని ఎమ్మెల్యేకు సూపర్‌వైజర్ శ్రీనివాసులు వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లను మార్కెట్ యార్డు అధికా రులు దగ్గరుండి పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారు జామున హోల్‌సేల్ వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన కూరగాయలను రీటైల్ వ్యాపారులకు విక్రయిం చేందుకు చర్యలు చేపట్టను న్నారు.
రీటైల్ వ్యాపారులు, రైతులు మార్కెట్‌యార్డులో, కర్నూలు నగరంలోని సీ.క్యాంపు రైతుబజార్, కొత్తపేట, వెంకటరమణ కాలనీలోని అమీన్ అబ్బాస్ నగర్ రైతుబ జార్లలో కూరగాయలు విక్రయిం చేందుకు సిద్ధమవు తున్నారు. దీని వల్ల కరోనా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి కూరగాయల విక్రయాల తీరు మార డంతో ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.