-
-
Home » Andhra Pradesh » Kurnool » valmiki should develop politically
-
వాల్మీకులు రాజకీయంగా ఎదగాలి
ABN , First Publish Date - 2020-12-29T04:47:18+05:30 IST
వాల్మీకులు రాజకీయంగా ఎదగాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వాల్మీకి సంఘం నాయకుడు డా.పార్థసారథి తెలిపారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు డా.పార్థసారథి
ఆదోని రూరల్, డిసెంబరు 28: వాల్మీకులు రాజకీయంగా ఎదగాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వాల్మీకి సంఘం నాయకుడు డా.పార్థసారథి తెలిపారు. మండలంలోని కపటి గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం అచ్చెల్లి ముత్తినపెండె మఠం పీఠాధిపతి శివరుద్రమునిస్వామి, గుడిసె కృష్ణమ్మ, వాల్మీకి సంఘం నాయకులు వెంకటరాముడు, దస్తగిరినాయుడు, రాంభీంనాయుడు, నీలకంఠప్ప, పంపాపతి, భద్రినాథ్‌స్వామి, గ్రామ నాయకులు రాజబాబు, వినేష్ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ వాల్మీకులు ఎస్టీగా సాధించాలంటే తప్పకుండా అందరు ఐక్యమత్యంగా పోరాడి ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్న వాల్మీకులు అందరూ ఎస్టీ జాబితా సాధన కోసం కృషి చేయాలన్నారు.
ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు
ఆదోని టౌన్: ప్రజా సమస్యలు వైసీపీ ప్రభుత్వం విస్మరించింది, పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలు, 15 లక్షల మందికి గృహ నిర్మాణాలు చేస్తున్నామన్న ప్రభుత్వం ఊరికి దూరంగా, శ్మశాన స్థలాల్లో, చెరువులు కుంటలలో పట్టాలు పంపిణీ చేయడం పట్ల అనేక ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రి, పట్టణ అధ్యక్షుడు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి ఆధూరి విజయకృష్ణ పాల్గొన్నారు.