వేదవతి ప్రాజెక్టును పరిశీలించిన సీఈ

ABN , First Publish Date - 2020-11-14T05:22:58+05:30 IST

వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేపట్టారు.

వేదవతి ప్రాజెక్టును పరిశీలించిన సీఈ

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 13: వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులను చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేపట్టారు. ఈ పనులను పరిశీలించేందుకు శుక్రవారం అమరావతి నుంచి సీడీవో సీఈ శ్రీనివాసు, అలాగే కర్నూలు సీఈ మురళీనాథ్‌ రెడ్డి, కర్నూలు మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి వేదవతి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే పనులు, మార్కింగ్‌ వెంటనే పూర్తి చేసి ప్రాజెక్టును నిర్మిస్తామని, దీని వల్ల వృథాగా సముద్రంలో కలిసిపోతున్న వరద నీటిని నిల్వ చేసి బీడు భూములకు తాగునీరు అందించే విధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని సీఈ శ్రీనివాస్‌ తెలిపారు.


Updated Date - 2020-11-14T05:22:58+05:30 IST