గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-12-20T05:09:14+05:30 IST

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి 40పై నన్నూరు బస్‌ స్టేజీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ఓర్వకల్లు, డిసెంబరు 19: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి 40పై నన్నూరు బస్‌ స్టేజీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. నన్నూరు గ్రామానికి చెందిన పొలాల కాపరి బోయ లక్ష్మన్న (71) పొలాల కాపరిగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం రోడ్డుపై వెళ్తుండగా కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వృద్ధుడిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 


Read more