భూ వివాదంలో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-10T05:42:05+05:30 IST

మండలంలోని జూలేపల్లె గ్రామంలో ఉన్న 85 సెంట్ల భూమి వివాదంలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు.

భూ వివాదంలో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

గోస్పాడు, డిసెంబరు 9: మండలంలోని జూలేపల్లె గ్రామంలో ఉన్న 85 సెంట్ల భూమి వివాదంలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో ఉన్న 85 సెంట్ల భూమిని గుంటూరుకు చెందిన శ్రీనివాసులు కొని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నానని, జూలేపల్లెకు చెందిన ప్రసాద్‌ ఇదే స్థలాన్ని అంతకంటే  ముందే అగ్రిమెంట్‌ ద్వారా కొన్నానని ఘర్షణ పడ్డారు. ఇరువురూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళినట్లు సమాచారం. ఇద్దరి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి, ఇద్దరి వాదనలు విన్న పోలీసులు రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్ళి పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ప్రసాద్‌ ఆ స్థలంలో నిర్మించుకున్న తాత్కాలిక రేకుల షెడ్డును  శ్రీనివాసులు తన బంధువులతో కలిసి తొలగించాడు. దీంతో ప్రసాద్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత శ్రీనివాసులు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయంలో తాను పంచాయితీ చేయలేదని, రివెన్యూ రికార్డుల ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించానని ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-10T05:42:05+05:30 IST