పోలీసుల బదిలీలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-18T10:29:38+05:30 IST

పోలీస్‌శాఖలో బదిలీల ప్రక్రియ బుధవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రారంభమైంది.

పోలీసుల బదిలీలు ప్రారంభం

కర్నూలు, జూన్‌ 17: పోలీస్‌శాఖలో బదిలీల ప్రక్రియ బుధవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రారంభమైంది. ఎస్పీ ఫక్కీరప్ప ఈ ప్రక్రియను ప్రారంభించారు. అడిషనల్‌ ఎస్పీ గౌతమిసాలి, ఓఎస్‌డీ ఆంజనేయులు పాల్గొన్నారు. అంతకుముందు పని చేసిన సర్కిల్‌గానీ, సొంత మండలానికిగానీ బదిలీ చేయకుండా ప్రక్రియ సాగింది. గ్రామీణ పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన వారిని పట్టణ పోలీస్‌స్టేషన్‌లకు, పట్టణ పోలీస్‌స్టేషన్‌లలో పని చేసిన వారికి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లకు కేటాయించారు. మెడికల్‌ సమస్య, స్పౌజ్‌ రిక్వెస్టులు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. మొదటి రోజు 108 మంది పోలీసులకు బదిలీలు చేపట్టారు.


48 మంది ఏఎస్‌ఐలు, 60 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఎవరికైనా న్యాయం జరగకపోతే మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదోన్నతి పొందిన ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఒకేచోట ఐదేళ్ల పనికాలం పూర్తి కాకుంటే అదే పోలీస్‌స్టేషన్‌లో కొనసాగవచ్చన్నారు. ఆరు నెలల్లో 26 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కె.రాధాకృష్ణ, ఏవో సురేష్‌బాబు, పీఏ నాగరాజు, ఈకాఫ్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఆర్‌ఐ రామకృష్ణ, పోలీస్‌ సంగం అధ్యక్షులు నాగరాజు ఉన్నారు. 

Updated Date - 2020-06-18T10:29:38+05:30 IST