-
-
Home » Andhra Pradesh » Kurnool » Transfers must be carried out
-
బదిలీలు నిర్వహించాలి: ఎస్‌టీయూ
ABN , First Publish Date - 2020-05-18T09:46:36+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు తక్షణమే చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర

కర్నూలు(ఎడ్యుకేషన్), మే 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు తక్షణమే చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు. మే నెల వేతనాలు వంద శాతం చెల్లించాలని, మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలన్నారు. గత మూడేళ్లుగా బదిలీలు లేనందున తక్షణమే బదిలీలు నిర్వహించాలన్నారు. జీవో.నెం.29 ప్రకారం ఉపాధ్యాయులు క్రమబద్ధీకరణ చేయాలని తెలిపారు. రేషనలైజేషన్ ఉన్న వారికి 10 పాయింట్లు ఇచ్చి, బదిలీ జాబితాలో చేర్చాలని తెలిపారు.