ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌పై శిక్షణ

ABN , First Publish Date - 2020-03-12T11:09:27+05:30 IST

ఆర్టీసీ కేంద్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న డిపో కేంద్రం (కర్నూలు-1, నంద్యాల డిపోలలో) ఔత్సాహికులైన డ్రైవర్లకు హెవీ డ్రైవింగ్‌పై లైసెన్సు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కర్నూలు రీజినల్‌ మేనేజర్‌ టీవీ రామం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌పై శిక్షణ

కర్నూలు(రూరల్‌), మార్చి 11: ఆర్టీసీ కేంద్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న డిపో కేంద్రం (కర్నూలు-1, నంద్యాల డిపోలలో) ఔత్సాహికులైన డ్రైవర్లకు హెవీ డ్రైవింగ్‌పై లైసెన్సు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కర్నూలు రీజినల్‌ మేనేజర్‌ టీవీ రామం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులు వచ్చే నెల 1వ తేదీ  నుంచి 32 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ప్రతి బ్యాచ్‌కు 16 మందిని ఎంపిక చేసి, 16 రోజులు పాటు థియరీ, మరో 16 రోజుల పాటు నిపుణుల చేత డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామని తెలిపారు.  

Updated Date - 2020-03-12T11:09:27+05:30 IST