ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌పై శిక్షణ

ABN , First Publish Date - 2020-12-28T05:23:36+05:30 IST

ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌లో ఔత్సాహికులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కర్నూలు రీజనల్‌ మేనేజర్‌ టి. వెంకటరామం తెలిపారు.

ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌పై శిక్షణ

కర్నూలు(రూరల్‌), డిసెంబర్‌ 27: ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌లో ఔత్సాహికులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కర్నూలు రీజనల్‌ మేనేజర్‌ టి. వెంకటరామం తెలిపారు. ఈ శిక్షణ తరగతులు కర్నూలు, నంద్యాల డివిజన్‌లో మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఇప్పటికే నాలుగు బ్యాచ్‌లు పూర్తి అయ్యాయని, ఐదో  బ్యాచ్‌ కూడా ప్రారంభమవుతుందని వివరించారు. ఈ శిక్షణ 32 రోజుల పాటు నిర్వహిస్తామని, అందులో పదహారు రోజులు శిక్షణ, మరో పదహారు రోజులు థియరీ ఉంటుందని తెలిపారు. శిక్షణ పూర్తి అయ్యాక మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారుల చేత లైసెన్స్‌ సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని తెలిపారు. వివరాలకు 9959225793, 9959225800 నెంబర్లలో  సంప్రదించాలని సూచించారు. 


Updated Date - 2020-12-28T05:23:36+05:30 IST