7 గంటల పాటు అవస్థలు

ABN , First Publish Date - 2020-11-20T05:13:53+05:30 IST

మహానంది మండలం నల్లమలలోని నంద్యాల- గిద్దలూరు రహదారిలో గురువారం తెల్లవారుజామున 5గంటలకు భారీ లారీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయు సాంకేతిక కారణంతో రహదారికి అడ్డంగా నిలిచిపోయుంది.

7 గంటల పాటు అవస్థలు
నల్లమలలో రహదారిపై నిలిచిపోయిన లారీ

 భారీ వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం

మహానంది, నవంబరు 19: మహానంది మండలం నల్లమలలోని నంద్యాల- గిద్దలూరు రహదారిలో గురువారం తెల్లవారుజామున 5గంటలకు భారీ లారీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయు సాంకేతిక కారణంతో రహదారికి అడ్డంగా నిలిచిపోయుంది. ఆ రహదారిలో వెళ్లే వాహనాలు ఎక్కడివి అక్కడే ఏడు గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహానంది హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ సిబ్బంది సహాయంతో అక్కడి చేరుకొన్నారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో మధ్యాహ్నం 12 గంటలకు రహదారికి అడ్డంగా ఉన్న లారీని పక్కకు తరలించారు. 

Updated Date - 2020-11-20T05:13:53+05:30 IST