-
-
Home » Andhra Pradesh » Kurnool » tomorrow iiit exam
-
రేపు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-11-27T06:04:57+05:30 IST
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే (ఆర్‌జీయూకేటీ సెట్-2020) ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని డీఈవో సాయిరాం గురువారం తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), నవంబరు 26: ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే (ఆర్‌జీయూకేటీ సెట్-2020) ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని డీఈవో సాయిరాం గురువారం తెలిపారు. జిల్లాలో 7,612 మంది విద్యార్థులు ఉన్నారని, 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 46 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 46 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 8 మంది రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.