రేపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌

ABN , First Publish Date - 2020-12-10T05:59:28+05:30 IST

ఈ నెల 11న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యసేవలు దేశవ్యాప్తంగా బంద్‌ చేస్తున్నట్లు కర్నూలు ఐఎంఏ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి డా.బి.రమేష్‌, డా.ఎస్‌వీ రాంమోహన్‌ రెడ్డి, డా.రామచంద్ర నాయుడు ప్రకటనలో తెలిపారు.

రేపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌

  1.  ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..


కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 9: ఈ నెల 11న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యసేవలు దేశవ్యాప్తంగా బంద్‌ చేస్తున్నట్లు కర్నూలు ఐఎంఏ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి డా.బి.రమేష్‌, డా.ఎస్‌వీ రాంమోహన్‌ రెడ్డి, డా.రామచంద్ర నాయుడు ప్రకటనలో తెలిపారు. ఆయుర్వేద వైద్యులతో ఆపరేషన్లు చేయించేలా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సిఫార్సు మేరకు కేంద్రం ఆమోదించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 11న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర, కొవిడ్‌ కేసులకు చికిత్సలు అందిస్తామన్నారు. 

Updated Date - 2020-12-10T05:59:28+05:30 IST