దేవాలయాలపై దాడులు సహించం
ABN , First Publish Date - 2020-09-12T10:54:23+05:30 IST
హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేయడాన్ని సహించేదిలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు. బీజేపీ, జనసేన ఆ

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య
కలెక్టరేట్ ఎదుట బీజేపీ, జనసేన ధర్నా
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 11: హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేయడాన్ని సహించేదిలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు. బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ వీరపాండియన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరయ్య మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీఎస్ నాగరాజయాదవ్, బీజేపీ నగర అధ్యక్షుడు యోగానందచౌదరి, కార్యదర్శి చింతలపల్లి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ సుబ్బారెడ్డి, అనంతరెడ్డి, రిక్కి వెంకటేశ్వర్లు, అంబలి కాశీవిశ్వనాథ్, బైరెడ్డి దినేష్‌రెడ్డి, శ్రీనివాసచారి, టీజీఆర్ గణేష్, ప్రసాద్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.