డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి: ఫ్యాప్టో

ABN , First Publish Date - 2020-12-10T05:37:41+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్‌నాయక్‌, కిశోర్‌, మునిస్వామి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి: ఫ్యాప్టో

ఆత్మకూరు, డిసెంబరు 9: ఉపాధ్యాయ బదిలీలను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్‌ చేస్తూ.. గురువారం చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్‌నాయక్‌, కిశోర్‌, మునిస్వామి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల్లో అన్ని ఖాళీలను చూపి నిష్పక్షపాతంగా బదిలీ ప్రక్రియ జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఏసుయాదవ్‌, రాజ్‌కుమార్‌, శివకుమార్‌, విదుభూషణ్‌ తదితరులు ఉన్నారు. 


ఆళ్లగడ్డ: ఉపాధ్యాయుల బదిలీల్లో ఖాళీలను చూపించాలని ఎస్టీయూ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ శ్రీనివాసులు డిమాండు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఖాళీలను 20 నుంచి 30 వరకు బ్లాక్‌ చేయడం వల్ల సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం కలుగుతుందన్నారు. ఈ సమస్యపై కర్నూలు కలెక్టర్‌ కార్యాలయాన్ని గురువారం ముట్టడిస్తామని అన్నారు. 


Updated Date - 2020-12-10T05:37:41+05:30 IST