నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్‌ జిల్లాకు రాక

ABN , First Publish Date - 2020-11-19T05:33:28+05:30 IST

ఏపీ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి గురువారం జిల్లాకు రానున్నారు.

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్‌ జిల్లాకు రాక

కర్నూలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి గురువారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11.30 గంటలకు ఆయన స్థానిక తుంగభద్ర పంప్‌హౌ్‌సకు చేరుకుని బహుళ ప్రయోజన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఆసపత్రి దగ్గరలోని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌. వెంకటరామారాజు నివాసంలో డిప్యూటీ స్పీకర్‌ భోజనం చేస్తారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. 


Updated Date - 2020-11-19T05:33:28+05:30 IST