నేడు ‘చోంగా రోటీ’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-12-27T05:24:24+05:30 IST

తెలుగు కళా స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ ముస్లిం కథలు ‘చోంగా రోటీ’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు ఎంపీఎం రెడ్డి, ఎస్‌ఎస్‌ పటేల్‌ తెలిపారు.

నేడు ‘చోంగా రోటీ’ పుస్తకావిష్కరణ


కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 26: తెలుగు కళా స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ ముస్లిం కథలు ‘చోంగా రోటీ’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు ఎంపీఎం రెడ్డి, ఎస్‌ఎస్‌ పటేల్‌ తెలిపారు. పెద్దమార్కెట్‌ సమీపంలోని రాయల్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కథా రచయిత ఇనాయతుల్లా అధ్యక్షతన, కథా రచయిత జి.వెంకటకృష్ణ పుస్తక సమీక్ష చేస్తారని, కథా రచయితులు డాక్టర్‌ వేంపల్లి షరీఫ్‌, అక్కంపేట ఇబ్రహీం, సొదుం శ్రీకాంత్‌, జంధ్యాల రఘుబాబు, పి. మారుతి ప్రసంగిస్తారని తెలిపారు.

Updated Date - 2020-12-27T05:24:24+05:30 IST