నేడు ఆర్‌యూ వీసీ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-11-27T05:54:08+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతిగా ఎ.ఆనందరావు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.

నేడు ఆర్‌యూ వీసీ బాధ్యతల స్వీకరణ

కర్నూలు(అర్బన్‌), నవంబరు 26: రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతిగా ఎ.ఆనందరావు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రం లోని 5 యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతులను నియమించగా.. ఎ. ఆనందరావు అనంతపురం జేఎన్‌టీయూలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టరుగా పనిచేస్తూ పదోన్నతిపై ఆర్‌యూకు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా కొనసా గుతున్న ఉన్నత విద్యామండలి కమిషనర్‌ ఎంఎం నాయక్‌ నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.


Read more