టీఎన్‌ఎస్‌ఎఫ్ కమిటీల నియామకం
ABN , First Publish Date - 2020-12-17T05:31:58+05:30 IST
టీఎన్‌ఎస్‌ఎఫ్ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ బుధవారం లేఖను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు.

కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 16: టీఎన్‌ఎస్‌ఎఫ్ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ బుధవారం లేఖను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు సమర్ధులైన వారిని అధ్యక్ష, కార్యదర్శులుగా నియమించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆదోనికి చెందిన జలారి రామాంజినేయులు, కార్యదర్శిగా కర్నూలుకు చెందిన ప్రవీణ్, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడిగా నంద్యాలకు చెందిన ముద్దం నాగ నవీన్, సెక్రటరీగా పాణ్యంకు చెందిన మహబూబ్ బాషాను నియమించారు.