టిడ్కో ఇళ్లు అందరికీ ఇవ్వాలి: టీడీపీ

ABN , First Publish Date - 2020-11-22T04:54:31+05:30 IST

జీ ప్లస్‌ త్రీ ఇల్లు అర్హులైన వారందరికి ఇవ్వాలని టీడీపీ నాయకులు లక్ష్మినారాయణ, తిమ్మప్ప, సజ్జాద్‌, మారుతి డిమాండ్‌ చేశారు.

టిడ్కో ఇళ్లు అందరికీ ఇవ్వాలి: టీడీపీ

ఆదోని, నవంబరు 21: జీ ప్లస్‌ త్రీ ఇల్లు అర్హులైన వారందరికి ఇవ్వాలని టీడీపీ నాయకులు లక్ష్మినారాయణ, తిమ్మప్ప, సజ్జాద్‌, మారుతి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలైన 4704 మంది లబ్ధిదారులను గుర్తించి గృహ ప్రవేశాలు చేసేందుకు వీలుగా ఇంటి నంబర్లను కూడా కేటాయించామన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి రూ.లక్ష, రూ.50 వేలు, రూ.500 ప్రకారంగా చెల్లించారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.500 చెల్లించిన వారికి ఇళ్లను కేటాయించకపోవడం దారుణమన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగరాజు, లక్ష్మన్న, రాజశేఖర్‌, రాము పాల్గొన్నారు. 

  పంపిణీకి నిబంధనలు విధించడం ఏమిటి?

అర్హులైన లబ్ధిదారులకు జీ ప్లస్‌ త్రీ గృహాలు పంపిణీకి నిబంధనలు విధించడం ఏమిటని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అయ్యప్పగౌడ్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు అజయ్‌బాబు ప్రశ్నించారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీ ప్లస్‌ త్రీ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులతో ధ్రువపత్రాలపై సంతకాలు చేయించుకొని ఇవ్వడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా సమితీ సభ్యుడు కల్లుబావి రాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్‌, లక్ష్మినారాయణ, నాగరాజు, ప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T04:54:31+05:30 IST