ఆటో బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-25T05:55:28+05:30 IST

మండలంలోని భోజనం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

ఆటో బోల్తా.. ఒకరి మృతి

  1. ఆరుగురికి గాయాలు


బండి ఆత్మకూరు, నవంబరు 24: మండలంలోని భోజనం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మండలంలోని పెద్దదేవళాపురం గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు గడివేముల మండలంలోని గని గ్రామానికి పనికి ఆటోలో వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా  భోజనం గ్రామ శివారులోని కేసీ పిల్లకాలువ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడు మందికి గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సామక్క (48) అనే మహిళ కలుకోలేక మృతి చెందారు. మరియమ్మ, సుకన్య, సాలమ్మ, ఆటో డ్రైవర్‌ చిన్నపుల్లయ్యతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. 

Read more