రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-07T05:18:40+05:30 IST

మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

మహానంది, డిసెంబరు 6: మహానంది మండలం గాజులపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మహానంది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులపల్లి సమీపంలోని బసాపురం చెరువు వద్ద గ్రామానికి చెందిన బోయశంకర్‌, మడ్డి వెంకటేశ్వర్లు ు పొలం పనులకు వెళ్లి తిరిగి మోటర్‌ బైక్‌పై తిరిగి వస్తుండగా గిద్దలూరు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను స్థానికులు చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాజులపల్లి- బోయలకుంట్ల మెట్ట రహ దారిలో మోటర్‌ బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై ఉన్న గాజులపల్లి ఆర్‌ఎస్‌కు చెందిన చిన్నకుళ్ళాయప్ప గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more