పోలీసులు స్ఫూర్తిగా నిలవాలి

ABN , First Publish Date - 2020-06-25T10:56:46+05:30 IST

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో పోలీసులు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.

పోలీసులు స్ఫూర్తిగా నిలవాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఫక్కీరప్ప 


కర్నూలు, జూన్‌ 24: కొవిడ్‌-19 నివారణ చర్యల్లో  పోలీసులు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.  జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి  బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని  పోలీ్‌సస్టేషన్లలోని సిబ్బందికి  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు కుటుంబాలు, సిబ్బంది, అధికారులు కరోనా వైరస్‌ నుంచి స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు.  కరోనా లక్షణాలు ఉంటే  వైద్యం చేయించుకోడానికి ముందుకు రావాలన్నారు.


ఫిర్యాదుదారులు పోలీ్‌సస్టేషన్లకు వచ్చినప్పుడు థర్మల్‌ స్కానర్‌ వాడాలన్నారు. శానిటైజర్లు, మాస్కులు వాడేలా  చూడాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీ్‌సస్టేషన్‌ పరిసరాలను, పోలీసు వాహనాలను కూడా ఎప్పటికప్పుడు హైపో ద్రావణంతో శానిటైజ్‌ చేసుకోవాలని తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ గౌతమిశాలి, హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌, నాన్‌ క్యాడర్‌ ఎస్పీ ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T10:56:46+05:30 IST