నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ నేతలపై పోలీసుల జులూం

ABN , First Publish Date - 2020-03-15T11:11:09+05:30 IST

నంద్యాలలోని బీజేపీ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ బీజేపీ నేతలపై పోలీసుల జులూం

నంద్యాల (నూనెపల్లె)/ గోస్పాడు, మార్చి 14: నంద్యాలలోని బీజేపీ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోస్పాడు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరు శనివారం బీ ఫారం తీసుకొనేందుకు  నంద్యాలలోని బీజేపీ కార్యాలయం వద్దకు  వచ్చారు.   టూ టౌన్‌ సీఐ కంబగిరిరాముడు, సిబ్బంది బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకొని బీ ఫారం తీసుకునే నాయకులను అడ్డగించారు. దీంతో   ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


  గోస్పాడు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలలో బీజేపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ నాయకులు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని గత మూడు రోజుల నుంచి భయభ్రాంతులకు గురి చేశారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గని బీజేపీ నాయకులు బీ ఫారం కోసం బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయంలో బీజేపీ నమోసంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో గోస్పాడు బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చారు. ఆ సమయంలో  టూటౌన్‌ సీఐ కంబగిరిరాముడు, సిబ్బంది చేరుకొని అడ్డుకున్నారు. అపరిచిత వ్యక్తులు ఉన్నారని, వారం దరూ  పోలీస్‌ స్టేషన్‌కు రావాలని అనడంతో   వాగ్వాదం చోటు చేసుకుంది.


అభ్యర్థులకు బీ ఫారం ఇస్తున్నామని, గోస్పాడుకు వెళ్లి  అందజేయాల్సి ఉందని  మధు అన్నారు. అయితే  టూటౌన్‌ సీఐ అభ్యర్థులకు బీఫారం ఇవ్వవద్దని, నామి నేషన్‌  ఉపసంహరించుకొని  స్టేషన్‌కు రావా లని   చెప్పడంతో పరిస్థితి మరింతగా ఉద్రిక్త తకు  దారి తీసింది. బీజేపీ నాయకుడు అభిరుచి మధు విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్ళారు. జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

గోస్పాడు ఆర్‌వో 

కార్యాలయం వద్ద మరోసారి

 నంద్యాలలో జరిగిన పరిణామాల అనంతరం బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థులు బీ ఫారం అందించేందుకు గోస్పాడులోని ఆర్‌వో కార్యాలయం వద్దకు తమ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి వచ్చారు. అక్కడికి చేరుకునే సరికి వైసీపీ నాయకులతో ఎస్‌ఐ చర్చలు జరుపుతున్నారని బీజేపీ, ఇతర పార్టీల తరపున నామినేషన్లు వే సిన అభ్యర్థులను  ప్రలోభాలు, బెదిరింపులతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు  తెలిసిందని అన్నారు. దీన్ని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులతో కలిసి ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తనపై  దౌర్జన్యం చేశారని మధు ఆరోపించారు.

Updated Date - 2020-03-15T11:11:09+05:30 IST