నిధులు దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-16T11:54:10+05:30 IST

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియో గం చేస్తోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

నిధులు దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి


కొలిమిగుండ్ల, ఆగస్టు 15: ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియో గం చేస్తోందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలో టీడీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దళితుల ఓట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో దళితులు, ఉద్యోగులు, వైద్యులపై దాడులు అధికమయ్యాయని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి దళిత ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి, ప్రచార కార్యదర్శి కోటపాడు శివరామిరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు హుస్సేన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నంద్యాల ప్రసాద్‌, టీడీపీ నాయకులు కల్వటాల కృష్ణ రంగారెడ్డి, కామిని భాస్కర్‌రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T11:54:10+05:30 IST