16 జడ్పీటీసీలు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-03-15T11:14:20+05:30 IST

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవం అయ్యాయి. 53 జడ్పీటీసీ స్థానాలకు గానూ 16 ఏకగ్రీవం

16 జడ్పీటీసీలు ఏకగ్రీవం

కర్నూలు(న్యూసిటీ), మార్చి 14: జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవం అయ్యాయి. 53 జడ్పీటీసీ స్థానాలకు గానూ 16 ఏకగ్రీవం అయ్యాయి. రిటర్నింగ్‌ అధికారి, జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య ఏకగ్రీవం అయిన జడ్పీటీసీలకు డిక్లరేషన్‌ పత్రాలను  శనివారం అందజేశారు. 53 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 351 నామినేషన్లు వచ్చాయి. వీటిలో పదింటిని తిరస్కరించారు. 150 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.


ఏకగ్రీవం పోనూ మిగిలిన 37 మండలాల్లో 188 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున, స్వతంత్రంగా బరిలో నిలిచారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో 804 ఎంపీటీసీ స్థానాలకు 4020 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో 150 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 70 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు ఆదివారం నుంచి వాహనాలకు సీఈవో అనుమతి ఇస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో అన్ని మండలాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.  

అభ్యర్థి పేరు                మండలం

1. ఎర్రబోతుల వెంకటరెడ్డి కొలిమిగుండ్ల

2. విరుపాక్షి చిప్పగిరి

3. లక్ష్మీసుబ్బమ్మ బనగానపల్లె

4. రామతులశమ్మ బండి ఆత్మకూరు

5. శివలక్ష్మి బేతంచెర్ల

6. రామిరెడ్డి గారి జగదీశ్వరమ్మ గోస్పాడు

7. బుజ్జమ్మ హోళగుంద

8. గోపిరెడ్డిగారి వెంకటలక్ష్మి కోవెలకుంట్ల

9. జి.పవిత్ర కోసిగి

10. గోవిందమ్మ మంత్రాలయం

11. చల్లా శ్రీలక్ష్మి అవుకు

12. బి.శ్రీరాంరెడ్డి ప్యాపిలి

13. మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి సంజామల

14. కాసాని పుణ్యలక్ష్మీదేవి ఉయ్యాలవాడ

15. సుహాసిని క్రిష్ణగిరి 

16. రాజ్‌కుమార్‌ డోన్‌

Updated Date - 2020-03-15T11:14:20+05:30 IST