జిల్లాకు చేరిన పది ప్రశ్న పత్రాలు

ABN , First Publish Date - 2020-03-28T10:05:36+05:30 IST

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయి.

జిల్లాకు చేరిన పది ప్రశ్న పత్రాలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 27: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరాయి. నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు ఎదురుగా వున్న ఎయిడెడ్‌ సెయింట్‌ జోసఫ్‌ బాలికల హై స్కూల్‌లో మొదటి విడత సెట్‌-1, 2 పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. కరోనా వ్యాప్తితో పది పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను ప్రకటిస్తామని డీఈవో సాయిరాం తెలిపారు. పది పరీక్షా పత్రాలను భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ ప్రశ్నపత్రాలను జిల్లాలోని ఆయా పోలీ్‌సస్టేషన్లకు తరలించి భద్రపరచాల్సి ఉంది. లాక్‌డౌన్‌తో జిల్లాలో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం ఆధ్వర్యంలో జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఓంకార్‌యాదవ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు తరలిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-03-28T10:05:36+05:30 IST