తెలుగు భాష అభివృద్ధికి కృషి: యార్లగడ్డ

ABN , First Publish Date - 2020-12-11T05:38:07+05:30 IST

తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.

తెలుగు భాష అభివృద్ధికి కృషి: యార్లగడ్డ

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 10: తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. సునయన ఆడిటోరియంలో అధికార భాష అమలుపై వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. భాషాభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సర్వేలో 97 శాతం మంది తల్లిదం డ్రులు ఇంగ్లీష్‌ మీడియం చదువులను కోరుకున్నారని, నిరుపేద కుటుంబాల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే సీఎం ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చేసేలా చూడాలని తనను సీఎం కోరారని తెలిపారు. సమీక్షలో సీనియర్‌ సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్‌ మస్తాన్‌, ఆచార్య శరత్‌, జోత్స్నరాణి, ఆచార్య చందు సుబ్బారావు, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:38:07+05:30 IST