వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం

ABN , First Publish Date - 2020-12-11T05:22:59+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి

  1.  కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి


తుగ్గలి, డిసెంబరు 10: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. గురువారం చెన్నంపల్లిలో టీడీపీ నాయకుడు మాబాషా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాబాషా గృహంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దాని వల్ల రాబోయే ఎన్నికల్లో  ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, ఎద్దులదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బత్తిన కిరణ్‌కుమార్‌, వెంకటపతి, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్‌, లక్ష్మీనారాయణచౌదరి పాల్గొన్నారు. 


జగన్‌ది తుగ్లక్‌ పాలన: కోట్ల

డోన్‌(రూరల్‌):  రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ తుగ్లక్‌ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం డోన్‌లోని టీడీపీ నాయకుడు ఓబులాపురం శేషిరెడ్డి స్వగృహంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్కసాగరం లక్ష్మీరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వైసీపీ ప్రభుత్వం నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేశారని  ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్‌నాయుడు, చనుగొండ్ల శ్రీరాములు, రవి, ఖాజా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:22:59+05:30 IST