నంద్యాల నుంచి ఇద్దరు టీడీపీ కార్యదర్శులు

ABN , First Publish Date - 2020-11-07T05:09:27+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వెదుర్ల రామచంద్రారావుకు, టీడీపీ బీసీ విభాగం నేత జిల్లెల్ల శ్రీరాములుకు స్థానం కల్పించారు.

నంద్యాల నుంచి ఇద్దరు టీడీపీ కార్యదర్శులు

నంద్యాల, నవంబరు 6: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  వెదుర్ల రామచంద్రారావుకు, టీడీపీ బీసీ విభాగం నేత జిల్లెల్ల శ్రీరాములుకు స్థానం కల్పించారు. 

వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసికెళ్తా 

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగానన్ను ఎంపిక చేసిన పార్టీ అధినేతకు కృతజ్ఞతలు.  వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా  పని చేస్తా.

- వెదర్లు రామచంద్రారావు, నంద్యాల 

టీడీపీ బీసీల పక్షపాతి

తెలుగుదేశం పార్టీ తొలిసాని అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నాంది పడింది.  చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగింది. 

 - జిల్లెల్ల శ్రీరాములు,  నంద్యాల

టీడీపీ కార్యదర్శిగా రామేశ్వరరెడ్డి  

కొలిమిగుండ్ల: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నంద్యాల రామేశ్వరరెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ శుక్రవారం ప్రకటించింది. దీంతో మండల టీడీపీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయను 

 నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి టీడీపీ అధినేత నన్ను  రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు. పార్టీకి ఎల్లవేళ్లలా రుణపడి ఉంటా. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.   

            - నంద్యాల రామేశ్వరరెడ్డి 

Updated Date - 2020-11-07T05:09:27+05:30 IST