టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

టీడీపీ హయాంలో నిర్మిం చిన జీప్లస్‌ త్రీగృహాలను లబ్ధిదారుకు అందజేయాలని మున్సి పల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కొండయ్య చౌదరి, రాందాస్‌గౌడ్‌, ఫారుక్‌, సుందరరాజు, కఠారి రాజేంద్ర, కలీముల్లా డిమాండ్‌ చేశారు.

టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలి
ఎమ్మిగనూరు పట్టణంలోని జీ ప్లస్‌ గృహాల సముదాయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

  1.  టీడీపీ నాయకుల నిరసన  

ఎమ్మిగనూరు, నవంబరు 6: టీడీపీ హయాంలో నిర్మిం చిన జీప్లస్‌ త్రీగృహాలను లబ్ధిదారుకు అందజేయాలని మున్సి పల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కొండయ్య చౌదరి, రాందాస్‌గౌడ్‌, ఫారుక్‌, సుందరరాజు, కఠారి రాజేంద్ర, కలీముల్లా డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్రకమిటీ  పిలుపు మేరకు మాజీ కౌన్సిల ర్లు, వార్డు ఇన్‌చార్జిలు, కార్యకర్తలు శుక్రవారం జీప్లస్‌ గృహాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుతోనే వైసీపీ ప్రభుత్వం గృహాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దన్నారు. రంగస్వామిగౌడ్‌, రామకృష్ణ నాయుడు, మల్లి, జయన్న, దాదా, సలాం, ఫారుక్‌, దయసాగర్‌, మదు, తేజ, పెద్దరంగన్న, అంజి, శ్రీనివాసులు, బిజె ్జ నాగరాజు, రామకృష్ణ, జబ్బార్‌, మాబులు పాల్గొన్నారు.


సీఎం గారూ.. హామీలు అమలు చేయండి 

ఆదోని, నవంబరు 6: ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హమీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని తెలుగుయువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌చౌదరి అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లులేని పేదలను గుర్తించి రాష్ట్రంలో 7,58,788 జీ ప్లస్‌ త్రీ గృహాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటి వరకు 2,62,216 గృహాలు పూర్తి స్థాయి నిర్మాణాలు అయ్యాయని, గృహ ప్రవేశాలు కూడా చేసుకోచ్చన్నారు. రాష్ట్రంలో 80 వేల మంది లబ్ధిదారులకు బ్యాంక్‌ రుణాలు సైతం పూర్తయ్యాయన్నారు. ఆదోనిలో లబ్ధిదారుల ఎంపిక చేసి 4,704 గృహాలకు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. జీ ప్లస్‌ త్రీ గృహాల నిర్మాణం ఆవరణలో విద్యుత్‌, తాగునీరు సరఫరా చేస్తే సరిపోతుందన్నారు. నిర్మించిన ఇళ్ల పంపిణీ చేయకపోగా డిసెంబరు నెలలో 70 వేల ఇళ్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రభుత్వం సంక్రాం తి పండుగ లాగా లబ్ధిదారులకు గృహాలను అప్పజెప్పకపోతే సం క్రాంతి రోజు లబ్ధిదాలతో గృహ ప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. 7వ తేదీన లబ్ధిదారులతో శిరుగుప్ప టర్నింగ్‌లో ఉన్న జీ ప్లస్‌ త్రీ ఇళ్ల ఆవరణంలో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. 


   ‘టిడ్కో గృహాలను కేటాయించాలి’

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 6: గత ప్రభుత్వం నిర్మిం చిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఐ కార్యదర్శి పంపన్నగౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సోమప్ప సర్కిల్‌లో సామూహిక రిలే నిరహారదీక్షలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17నెలలు కావస్తున్నా నేటికి లబ్ధిదా రులకు గృహాలను కేటాయించకపోవడం దారుణమ న్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 16న తామే లబ్ధిదారు కుల గృహాలను స్వాధీన పరుస్తామన్నారు. రాజీవ్‌, వినోద్‌, విల్స న్‌, భాగ్యలక్ష్మి, సోమేశ్వరరెడ్డి, తిమ్మగురుడు, తస్యన్న పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST