-
-
Home » Andhra Pradesh » Kurnool » tdp leaders visit in kurnool today
-
నేడు పుష్కర ఘాట్లను సందర్శించనున్న టీడీపీ నాయకులు
ABN , First Publish Date - 2020-11-28T04:40:44+05:30 IST
టీడీపీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కార్యదర్శి ప్రభాకర్ చౌదరి శనివారం కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శిస్తారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 27: టీడీపీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కార్యదర్శి ప్రభాకర్ చౌదరి శనివారం కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శిస్తారని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కేవలం వైసీపీ నాయకుల జేబులు నింపేందుకే పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.230 కోట్ల దాకా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఈ విషయంపై ప్రజలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం సక్రమంగా చేపట్టకుండా ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు. పుష్కర స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసు కునేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు వస్తున్నారని ఆయన తెలిపారు.