వనభోజన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బీసీ

ABN , First Publish Date - 2020-11-22T05:17:02+05:30 IST

కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి శనివారం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు.

వనభోజన మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బీసీ
పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

కొలిమిగుండ్ల, నవంబరు 21: కొలిమిగుండ్ల మండలంలోని కోరుమానుపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి శనివారం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. బీసీకి కోరుమానుపల్లె, ఉమ్మాయపల్లె టీడీపీ నాయకులు ఆదినారాయణరెడ్డి, సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. గ్రామ సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయంలో బీసీ ప్రత్యేక పూజలు చేసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మూలె రామేశ్వరరెడ్డి, జయలక్ష్మిరెడ్డి, శివారెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, హుస్సేన్‌రెడ్డి, మంచాల మద్దిలేటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more