టీడీపీ కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2020-12-18T04:58:32+05:30 IST

కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి (33) అనే టీడీపీ కార్యకర్త అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లెం గ్రామ పొలాల్లో మృతి చెందాడు.

టీడీపీ కార్యకర్త మృతి

కొలిమిగుండ్ల, డిసెంబరు 17: కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి (33) అనే టీడీపీ కార్యకర్త అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లెం గ్రామ పొలాల్లో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. గత బుధవారం తాడిపత్రి వైపు మోటారుసైకిల్‌పై వెళ్లాడు. రోడ్డు పక్కన మోటారుసైకిల్‌ ఉండగా కొద్ది దూరంలో ప్రతాప్‌రెడ్డి మృత దేహం ఉంది. పక్కనే పురుగు మందు బాటిల్‌ ఉంది. అటువెళ్తున్న వారు గమనించి తాడిపత్రి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డిగా అతని వద్ద ఉన్న ఆధారాలను బట్టి తెలుసుకున్నారు. ప్రతాప్‌రెడ్డి భార్య కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది.  


 నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే బీసీ దంపతులు 

కోటపాడు గ్రామానికి వెళ్లి ప్రతాప్‌రెడ్డిమృతికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ గురువారం రాత్రి నివాళి అర్పించారు. ప్రతాప్‌రెడ్డి బీసీ అనుచరుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా ఉండేవారు. ప్రతాప్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దిగ్ర్భాంతికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-18T04:58:32+05:30 IST