భూమా అఖిలపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-06-04T22:22:52+05:30 IST

మాజీమంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ నేత ఏవీ.సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు...

భూమా అఖిలపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్ : మాజీమంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ నేత ఏవీ.సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భర్త భార్గవ రాముడితో కలిసి భూమా అఖిలప్రియ తనను చంపేందుకు కుట్ర పన్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. గురువారం నాడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు.


కడప పోలీసులకు కృతజ్ఞతలు..

రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజోరెడ్డితో అఖిలప్రియ 50లక్షలకు సుఫారీ కుదుర్చుకున్నారు. మహిళ ముసుగులో అఖిలప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు. కుట్రను భగ్నం చేసి నన్ను కాపాడిన కడప పోలీసులకు కృతజ్ఞతలు. భూమా అఖిలప్రియ అనుచరుడు మాదా శ్రీను డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. నా ముగ్గురు కూతుళ్లతో సమానంగా అఖిలప్రియను ప్రేమగా చూసుకున్నాను. రాజకీయ కుట్రతోనే అఖిలప్రియ నా హత్యకు ప్రణాళిక రచించారు. మా పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాను.తక్షణమే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడిని అరెస్ట్ చేయాలిఅని ఏవీ సుబ్బారెడ్డి ఏబీఎన్ చానెల్ ద్వారా డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-04T22:22:52+05:30 IST