టీడీపీని మళ్లీ అధికారంలోకి తెద్దాం: సోమిశెట్టి

ABN , First Publish Date - 2020-11-08T05:24:18+05:30 IST

టీడీపీ మళ్లీ అధికారం చేపట్టేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేయింబవళ్లు పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉండి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

టీడీపీని మళ్లీ అధికారంలోకి తెద్దాం: సోమిశెట్టి

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 7: టీడీపీ మళ్లీ అధికారం చేపట్టేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రేయింబవళ్లు పనిచేస్తున్నారని, ఆయనకు అండగా ఉండి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన నంద్యాల నాగేంద్రకుమార్‌తోపాటు సోమిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ నాయకులు సత్రం రామకృష్ణుడు, సముద్రాల హనుమంతరావు, రవి శాలువ కప్పి సన్మానించారు. సోమిశెట్టి మాట్లాడుతూ టీడీపీ పేదల పార్టీ అని అన్నారు.  వైసీపీ నాయకుల బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

Updated Date - 2020-11-08T05:24:18+05:30 IST