ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

ABN , First Publish Date - 2020-03-18T11:23:24+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభు త్వం ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

 దౌర్జన్యంతో ఏకగ్రీవాలు చేసుకున్న మంత్రి  

  పోలీసులతో అభ్యర్థులను బెదిరిస్తే ఊరుకోం

  మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ


ఆలూరు, మార్చి 17: ప్రజాస్వామ్యాన్ని    వైసీపీ ప్రభు త్వం ఖూనీ చేస్తోందని  మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. మంగళవారం ఆలూరులో నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, హొళగుంద మండలాల్లో మంత్రి జయరాం అండతో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగి టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి  ఏకగ్రీవాలు సాధించారని అన్నారు.  పోలీసులతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని, అలా చేస్తే సహించమన్నారు.   ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా  వలంటీర్లతో సమావేశం నిర్వహించి వైసీపీకి మద్దతు ఇవ్వాలని మంత్రి చెప్పడం కోడ్‌ ఉల్లంఘన అన్నారు.


ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా విజృంభిస్తుందని ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉం చుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకే స్థానిక ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా పడ్డాయని ఇందులో టీడీపీ హస్తం ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అధికారులు, పోలీసులు పక్షపాత రహితంగా వ్యవహరించి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని అన్నారు.   రాష్ట్ర వ్యా ప్తంగా జరిగిన పరిణామం దృష్టిలో ఉంచుకొని కొత్త షెడ్యూలును విడుదల చేయాలన్నారు. ఈ  సమావేశంలో టీడీపీ నాయకులు దేవేంద్రప్ప, రఘుప్రసాద్‌రెడ్డి, రాంభీంనాయుడు, నారాయణరెడ్డి, సులక్షణరెడ్డి, కృష్ణంనాయుడు, ప్రహ్లాద్‌రెడ్డి, హనుమంతురెడ్డి, కృష్ణయాదవ్‌, బిల్లేకల్‌ వెంకటేశ్‌, మోకమల్లయ్య, నరసప్ప, దేవేంద్ర, మల్లప్ప  పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T11:23:24+05:30 IST