చెత్తలోనే చదువులు.. వ్యాధులకు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నా..

ABN , First Publish Date - 2020-12-18T04:45:33+05:30 IST

పట్టణంలోని నెహ్రూమెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో తరగతి గదు లన్నీ దుమ్ముదూళి, చెత్తచెదారంతో నిండిపోయింది.

చెత్తలోనే చదువులు.. వ్యాధులకు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నా..
స్కూల్‌ ఆవరణలో చెత్తబుట్ట

ఆదోని నెహ్రూ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు..


ఆదోని, డిసెంబరు 17: పట్టణంలోని నెహ్రూమెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో తరగతి గదులన్నీ దుమ్ముదూళి, చెత్తచెదారంతో నిండిపోయింది. విద్యార్థులే తరగతి గదులను శుభ్రం చేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా స్వీపర్‌ సెలువు పెట్టడంతో పాఠశాల గదులన్నీ చెత్తచెదారంతో నిండుకున్నాయి. ఆ చెత్తచె దారం మధ్యలోనే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు సైతం ఏమి చేయలేని పరిస్థితి. పురపాలక కమిషనర్‌కు పాఠశాల ఉపాధ్యాయులు స్వీపర్‌ను కేటాయిం చాలని కోరినప్పటికీ కాలయాపన చేయడంతో చెత్తంతా దిబ్బగా మారింది. చెత్తచెదారం, దుమ్ము దూళితో విద్యార్థులు వ్యాధులకు గురవుతు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు కొత్తగా మరో 350 మందికి పైగా చేరారు. ఇప్పటికే 1300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి పాఠశాలకు కనీసం స్వీపర్‌ కూ డా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాఠశాలను శుభ్రంగా ఉంచాలని విద్యార్థులు కోరుతున్నారు.  


మేమే శుభ్రం చేసుకుంటున్నాం

నెల నంచి తరగతి గదిని మేమే శుభ్రం చేసుకుంటున్నాం. బెంచీలపై దుమ్ము ఉంటోంది, అలాగే పాఠాలు వింటున్నాం. స్వీపర్లు లేకపోవడంతో గదులు చెత్తచెదారంగా తయారవుతున్నాయి.

- ఈశ్వర్‌, పదో తరగతి


చెత్తతో ఇబ్బంది పడుతున్నాం

స్వీపర్‌ మెడికల్‌ లీవ్‌లో వెళ్లడంతో శుభ్రం చేసేవారు లేరు. పరిసరాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. చెత్తమధ్యలోనే కూర్చుని పాఠాలు వింటున్నాం. పురపాలక కమిషనర్‌ స్పందించి మరొకరని కేటాయించాలి.  

- శ్రీహరి, పదో తరగతి  


 

Updated Date - 2020-12-18T04:45:33+05:30 IST